గీత కార్మికుడికి ఆర్థిక సహాయం
కుటుంబానికి భరోసా ఇచ్చిన గౌడ సంఘ జిల్లా నాయకులు
కుమారుడి చదువుకు చేయూతనిస్తామని హామీ..
స్పాట్ వాయిస్, కేసముద్రం: బోన్ క్యాన్సర్ తో కుడి చేయిని కోల్పోయి శాశ్వత అంగ వైకల్యానికి గురయ్యాడు కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన గుజ.మల్లయ్య గౌడ్. ఇతడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు శ్యామ్, గణేష్ ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబం గడువలేక కుమారులిద్దరు చదువు మానేసి ఒకరు మెకానిక్ షాప్ లో,మరొకరు కిరాణం షాప్ లో రోజు వారీ కూలీల కు వెళ్తున్నారు. ఈ విషాద ఘటన తెలుసుకున్న గ్రామ కౌండిన్య గౌడ యువకులు, గౌడ(గోపా) జిల్లా నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్,సమ్మెట వెంకన్న గౌడ్ సమక్షంలో మల్లయ్య గౌడ్ కుటుంబానికి రూ. 26500 ఆర్థిక సహాయం, యాబై కిలోల బియ్యం, రెండు నెలలకు సరిపడా వంట సామగ్రి అందజేశారు. అదే విధంగా మల్లయ్య కుటుంబ పరిస్థితి జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్ దృష్టి కి తీసుకురాగా వారి చిన్న కుమారుడు గణేష్ కుటుంబ పరిస్థితులు వల్ల చదువు ఆపేస్తే అతని చదువుకయ్యే ఖర్చు భరిస్తానని ,చదువు కొనగించేలా పూర్తి సహకరిస్తానని,మండల,జిల్లా నాయకుల తో చర్చించి కుంటుంబానికి భవిష్యత్తులో అండగా ఉండేలా గౌడ సంఘం తరుపున చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ యువ నాయకులు నరేటి.హరీష్, వల్లాల.రాజేందర్, వంగ.సురేందర్, మెంచు.వంశీ, వంగ.సంపత్, నరేటి.సాయి, నరేటి.వేణు, మోగులగాని.అశోక్, వేముల.యాకన్న, వంగ.యాకన్న, శీలం.యాకన్న, శీలం.రాములు, మాద.శ్రీనివాస్, సమ్మెటి.వెంకన్న, వల్లాల.శ్రావణ్, గండు.పరమేష్ , దోమల.విజయ్ పాల్గొన్నారు.
Recent Comments