పార్టీ బలోపేతానికి సైనికుల్లా నిలబడాలి..
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్
జోరుగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు
స్పాట్ వాయిస్, ఐనవోలు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐనవోలు మండలం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హన్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. పున్నేల్ క్రాస్ రోడ్డు లోని సత్యం గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు అతిథులకు డప్పు చప్పుల్లు, కోలాటాలుతో ఘన స్వాగతం పలికారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే 197 జయంతినీ పురస్కరించుకుని అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధే బీఆర్‌ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే రోల్‌మాడల్‌గా నిలిచిందని కొనియాడారు. పదేళ్ల క్రితం తెలంగాణ పల్లెలు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. నడి ఎండ కాలంలో కాలువల్లో నిండుగా నీళ్లు ఎప్పుడన్నా పోయినయా… ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చినయా ప్రజలు ఆలోచించాలని కోరారు. మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని వెల్లడించారు. అందుకే దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అలాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించి దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాని వెల్లడించారు. పార్టీ కోసం నిబద్దతతో పని చేస్తున్న కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని అన్నారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ మధుమతి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ తంపుల మోహన్,మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
RELATED ARTICLES
Recent Comments