Friday, November 15, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఒక్కసారి కాదు.. వందసార్లైనా కాళ్లు మొక్కుతా..

ఒక్కసారి కాదు.. వందసార్లైనా కాళ్లు మొక్కుతా..

స్పాట్ వాయిస్ , ఖమ్మం:   సీఎం కేసీఆర్ కాళ్లను ఒక్కసారి కాదు వందసార్లయినా మొక్కుతా’’ అని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. కొత్తగూడెం పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం మున్నూరుకాపు కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి రెండేండ్ల కిందట సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన సమావేశంలో నేను ఉన్నానని చెప్పారు. దశలవారీగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. తొలి దశలో కొత్తగూడెం లేకపోతే.. నేను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిక్వెస్ట్ చేశానని తెలిపారు. కొత్తగూడెం వెనుకబడి ఉందని, తొలిదశలోనే అక్కడ కాలేజీ ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలో కాలేజీ ఏర్పాటైంది. ఆ కృతజ్ఞతతో సీఎం పాదాలకు నమస్కరించానని చెప్పారు. కృతజ్ఞతగా చేసిన పనికి ఇంత రాద్ధాంతం అవసరమా?” అని ప్రశ్నించారు.

తెలంగాణ బాపు.. కేసీఆర్
తాను మెడిసిన్ చదువుకోవడానికి సొంతూరుని వదిలి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలనని , ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నానని డీహెచ్ అన్నారు. విద్యార్థులకు ఆ బాధ లేకుండా కొత్తగూడెంలోనే అన్ని రకాల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మెడికల్ కాలేజీ కూడా రావడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ క్రమంలో తాను ఉద్వేగానికి గురై సీఎం కాళ్లకు నమస్కరించానని వివరణ ఇచ్చారు. ‘‘కేసీఆర్ తెలంగాణ బాపు.. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపిత.. ఆయన నాకు తండ్రి సమానులని , ఆయనతో ఫొటో దిగడం, ఆయన పాదాలను తాకడంలో తప్పేమీ లేదు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా” అని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments