రాష్ర్టానికి చేరుకున్న విపక్షాల రాష్ర్టపతి అభ్యర్థి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో టీఆర్ఎస్ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే జలవిహార్‌కు చేరుకున్నారు. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.
Recent Comments