Sunday, November 24, 2024
Homeతెలంగాణరైతుల ధైర్యం కేసీఆర్

రైతుల ధైర్యం కేసీఆర్

ప్రతీ ఒక్కరికీ అందేలా సంక్షేమ పథకాలు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పులుకుర్తిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
స్పాట్ వాయిస్, దామెర: తెలంగాణ రైతుల ధైర్యం సీఎం కేసీఆర్ అని, ఆయనపై భరోసా రైతులు హాయిగా సాగు చేసుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం పులుకుర్తి గ్రామంలో రూ.7.50 కోట్లతో నూతన తారు రోడ్డు, రూ.20 లక్షలతో మహిళ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ.. దేశంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ బిడ్డను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితమైన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతీ ఒక్కరు గమనించాలన్నారు.

ఉచిత పథకాలు రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని, ముసలవ్వలకు అండగా నిలిచిన పెన్షన్లను ఎందుకు రద్దు చేయాలో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలని ఈ సందర్భంగా చెప్పారు. పులుకుర్తి గ్రామంలోనే పెన్షన్లకు దాదాపు 10 లక్షల రూపాయల పైగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. దేశంలోనే రైతులకు అండగా నిలబడి సీఎం మన కేసీఆర్ అని చెప్పారు. ఆరుగాలం శ్రమించే అన్నదాత కోసం రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వాటి మీద జీఎస్టీ పెట్టి బీజేపీ పేదవాడీ నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు కోసం ఇండ్లు కోల్పోయిన వారికి డబులు బెడ్ రూం ఇళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, మహిళ సంఘాలు ఆర్ధికంగా ఎదగాలని వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ  కల్పన కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, స్థానిక సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ సంధ్య అశోక్, మండల  అధ్యక్ష,కార్యదర్శులు గండు రామకృష్ణ,కృష్ణమూర్తి,మెంతుల రాజు,మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గట్ల విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments