టెక్స్ట్ టైల్ పార్క్ బాధితులకు 100 గజాల భూమి..
రైతులకు భరోసా కేసీఆర్
పరకాల ఎమ్మెల్యే చల్లా
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: టెక్స్ట్ టైల్ పార్క్ లో భూముల కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నెల రోజుల లోపు 100 గజాల భూమిని కేటాయిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం నందు కుంటపల్లి గ్రామంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆదివారం గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులకు పెద్దకొడుకులాగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అంటూ కొనియాడారు. రైతులకు భరోసాగా నిలిచారన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది.
ఉచితాలు వద్దనే బీజేపీకి బుద్ధి చెప్పాలి…
ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ ఓటుతో బుద్ధిచెప్పాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్ రూ. 75 ఉండేదని, ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో కొత్తవి ఇచ్చేవారు కాదన్నారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 చేసిందని, కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదని ఆరోపించారు. కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా పింఛన్ ను 10 ఇంతలు పెంచి, రూ.2016 అందిస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కన్న కొడుకు బతుకమ్మ పండుగకు చీర కొనిచ్చిన ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ చీర ఇస్తున్నారని చెప్పారు.
సంగెం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎస్ఈఆర్ పీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీఆర్డీఏ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, భారతీయ స్టేట్ బ్యాంక్ సంస్కృతి విహార్ హసన్ పర్తి, ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందచేశారు.
9 వేల మంది మహిళలకు ఉపాధి
సంగెం మండలంలోని ఎల్గూర్ రంగంపేట గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే చల్లా ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు రద్దు చేయాలని బీజేపీ ఆలోచిస్తోందంటూ మండిపడ్డారు. దసరా పండుగ తర్వాత పేదోళ్ల ఇండ్లలో పండుగ రాబోతుందని, ఇండ్లులేని పేదవారి డబుల్ బెడ్ లు అందజేస్తామని చెప్పారు. టెక్స్ట్ టైల్ పార్క్ లోని కైటెక్స్ కంపెనీలో త్వరలో 9 వేల మంది ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని,రానున్న రోజుల్లో పేదవారు బుద్ధి చెబుతారన్నారు.
ప్రత్యేక రాష్ర్టంలోనే తండాల అభివృద్ధి
సంగెం మండలం ఎల్గూర్ స్టేషన్ గ్రామంలోని ఎల్గుర్ స్టేషన్, నర్సనగర్, బిక్కుజునాయక్ తండా, జాటోతుతండా గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్లా గుర్తింపు కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి పల్లె అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రత్యేక రాష్ర్టంలోనే తండాలు అభివృద్ధి చెందినట్లు చెప్పారు. అబద్ధాలతో విష ప్రచారం చేస్తు,ప్రజలను ఆగం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు.
మీటర్లు పెట్టమంటున్న బీజేపీ ప్రభుత్వం
సంగెం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందచేసిన ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్ అన్నదాతకు ఉచిత కరెంట్ ఇస్తుంటే.. బీజేపీ మాత్రం బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టమని చెబుతోందన్నారు. కేంద్రం పేదవాడి దోచి, బడా కార్పొరేట్ సంస్థలకు పెడుతోందని, దేశంలోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్ముతోందని చెప్పారు. రానున్న రోజుల్లో దళిత బంధు పథకం ప్రతి దళిత కుటుంబానికి అందుతుందని ఎమ్మెల్యే చల్లా చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సంగెం ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కందగట్ల నరహరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సారంగపాణి , సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments