Sunday, April 6, 2025
Homeతెలంగాణఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేసీఆర్

ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేసీఆర్

సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచన
త్వరలోనే వరంగల్ లో భారీ బహిరంగ సభ
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ స్పష్టత‌నిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌లు అంశాల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స‌ర్వేల‌న్నీ మ‌న‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని, ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని చెప్పారు. ఆ లోపు పనులు పూర్తి చేసుకొని ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్రజ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్రలు చేయాల‌ని చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్యక‌ర్తల స‌మావేశాలు నిర్వహించి, ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఇకపై టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండదని,దానికి బదులుగా బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments