భూపాలపల్లిలో దళిత బంధు యూనిట్ల పంపిణీ
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణకాలనీలోని అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి 80 మంది లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లను, కార్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. 75 సవంత్సరాలుగా దళితుల అభ్యున్నతి కోసం ఏ నాయకుడు చేయనిది ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని, పార్టీలకు అతీతంగా దళిత బంధు పథకం అమలవుతుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయో లేదో చూడాలన్నారు. విజ్ఞులైన ప్రజలు గమనించాలని, అమ్మకు అన్నము పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అన్నట్లు ప్రతిపక్షాల పరిస్థితి ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ బడ్జెట్ లో 1,72,00 కోట్ల రూపాయలతో 1500 నుంచి 2 వేల వరకు దళిత బంధు యూనిట్ల పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిణి రాకేష్, కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర్, జెడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభ, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వార్డు కౌన్సిలర్ ఎడ్ల మౌనిక శ్రీనివాస్ కరాటే, ఇతర వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నియోజకవర్గ పరిధిలోని మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దళితుల ఆత్మ బంధువు కేసీఆర్
RELATED ARTICLES
Recent Comments