Sunday, November 24, 2024
Homeతెలంగాణకేసీఆర్ సర్పం కన్నా డేంజర్

కేసీఆర్ సర్పం కన్నా డేంజర్

కాంగ్రెస్- టీఆర్ఎస్ పొత్తు ఉండదు..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, కరీంనగర్: కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు కోసం పీకే ప్రయత్నం చేస్తున్నారనే వార్తల్లో నిజంలేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. పీకే కాంగ్రెస్ పక్షాన కేసీఆర్ ను కలిశారని ప్రచారం చేయడం సరికాదన్నారు. సోమవారం కరీనంగర్ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడడారు. అసలు ఇంకా పీకేనే తమ పార్టీలో చేర్చుకోలేదని, అలాంటప్పుడు ఆయనను తమ పార్టీ తరఫున ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. పీకేను కాంగ్రెస్ చేర్చుకోవాలా? వద్దా? అనే విషయంలో తమ హైకమాండ్ ఓ కమిటీ వేసిందని… ఆ కమిటీ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసే పార్టీలతో తెగతెంపులు చేసుకున్నాకే పీకేను పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు పరోక్షంగా కూడా పీకే వ్యూహకర్తగా ఉండడాన్ని ఒప్పుకునేదిలేదని, అలాంటిదే జరిగితే పీకేను పార్టీలోకి తీసుకోబోమన్నారు. పీకే కోసం కోసం కాంగ్రెస్ లేదని, కాంగ్రెస్ కోసమే పీకే పని చేయాలన్నారు. టీఆర్ఎస్ దొంగల పార్టీ అని, విష సర్పం కంటే కేసీఆర్ చాలా డేంజరని ఆరోపించారు. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ దగ్గరకు రానీయబోదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments