Saturday, April 5, 2025
Homeజాతీయంకేంద్రానికి కేసీఆర్ డెడ్ లైన్..

కేంద్రానికి కేసీఆర్ డెడ్ లైన్..

24 గంటల్లో ధాన్యంపై నిర్ణయం తీసుకోవాలి..
స్పాట్ వాయిస్, బ్యూరో: కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, ధాన్యం కొనుగోలు తో పాటు రాష్ర్టంపై చూపిస్తున్న వివక్షతపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న ఆయన.. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్లపైకి వ‌స్తార‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. మోడీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కేసీఆర్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments