Saturday, April 5, 2025
Homeతెలంగాణఢిల్లీకి సీఎం కేసీఆర్

ఢిల్లీకి సీఎం కేసీఆర్

అనారోగ్య సమస్యే కారణమా..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ పయనమయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం  ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ సైతం వెళ్లనున్నారు. ఢిల్లీలో అనారోగ్య సమస్యలకు చికిత్స చేయంచుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కేసీఆర్ వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ చెకప్ కోసం వెళ్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన యశోదాలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. దీంతో పాటు ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. అవసరమైతే ప్రధానమంత్రి మోడీని సైతం కలువనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments