యశోద ఆసుపత్రిలో అడ్మిట్
కాలుజారి పడటంతో విరిగిన తుంటి ఎముక
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి పడినట్లు సమాచారం. కాలికి పంచె తగలడంతో… కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది. ఎడమకాలి తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి కొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు, శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత మరిన్ని టెస్టులు చేస్తారని తెలిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
Recent Comments