Thursday, November 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్ కీలక ప్రకటన...

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్ కీలక ప్రకటన…

 స్పాట్  వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు పేర్కొన్నారు. శుక్రవారం     ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో చేరారు.   వైద్య పరీక్షల అనంతరం సీఎం  వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వివరణ ఇచ్చారు. ‘ సీఎం కేసీఆర్‌కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్‌గా చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా నీరసంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి తనతో  చెప్పారన్నారు. నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.. సీఎంకు సిటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేశాం. అంతా నార్మల్‌గానే ఉంది. ఎలాంటి బ్లాక్స్ లేవు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే అన్నీ చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు’ అని ఎంవీ రావు తెలిపారు. కాగా.. కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు కేబినెట్ మంత్రులు, ముఖ్యనేతలు ఇప్పుడిప్పుడే ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments