Friday, April 4, 2025
Homeక్రైమ్ఛత్తీస్ గఢ్‌లో ఎన్ కౌంటర్.. వరంగల్ లో విషాదం..

ఛత్తీస్ గఢ్‌లో ఎన్ కౌంటర్.. వరంగల్ లో విషాదం..

తరాలపల్లికి చెందిన అంకేశ్వరం సారయ్య మృతి..
స్పాట్ వాయిస్, కాజీపేట: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి మావోయిస్తు మృత దేహాల, భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్ల పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళీ మృతి చెందారు. ఏరియా కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న సారయ్య పై 25 లక్షల రివార్డ్ ఉంది. సారయ్య ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తరాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments