కవితకు బెయిల్..
5 నెలల ఉత్కంఠకు తెర..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. మార్చి 16నుంచి తిహార్ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కవిత 5 నెలలు జైలులో ఉన్నారు.
Recent Comments