Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్తీహార్ జైలుకు కవిత

తీహార్ జైలుకు కవిత

తీహార్ జైలుకు కవిత

14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌

స్పాట్ వాయిస్ , బ్యూరో: ఎంఎల్ సీ కవితను రిమాండ్ గడువు మంగళవారం తో ముగియడంతో ఈడీ మరోసారి కోర్టు ముందు హాజరుపర్చారు. ఆన్లైన్లో హాజరైన ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. మరోవైపు కవితను తీహార్ జైలుకు పంపేందుకు కోర్టు ఆదేశాలివ్వడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుమారుడి పరీక్షల దృష్ట్యా కవిత మధ్యంతర బెయిల్‌ కోరగా ఆ పిటిషన్‌పై ఏప్రిల్‌ 1న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

కడిగిన ముత్యంలా వస్తా

కోర్టుకు తరలించే సమయంలో కవిత మీడియా తో మాట్లాడారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇది మనీలాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చునని, తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments