అమెరికాలో… మదన్నపేట యువకుడు మృతి
స్పాట్ వాయిస్, కమలాపూర్:మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశి అమెరికాలోని మినేయిసోట లో అనుమానాస్పదగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశి సంవత్సరం క్రితం అమెరికాకు పై చదువుల నిమిత్తం వెళ్ళాడు. తల్లిదండ్రులు శ్రమకోర్చి పైసా పైసా కూడపెట్టి అతడిని అమెరికా పంపించాడు.కాని అతడు అనుమానాస్పదగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం స్పందించి అతడి మృతదేహాన్ని స్వస్థలాలకు చేర్చాలని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు కోరారు.
Recent Comments