Monday, May 26, 2025
Homeజిల్లా వార్తలుసల్లంగా సూడు తల్లి...

సల్లంగా సూడు తల్లి…

ఘనంగా పోచమ్మ బోనాలు
స్పాట్ వాయిస్, కమలాపూర్: మండల కేంద్రంలో గౌడ కులస్తులు పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కొత్త కుండలో నైవేద్యం వండి సమర్పించారు. ఉదయం గ్రామంలోని మహిళలు తలపై బోనాలను పెట్టుకొని పురవీధుల్లో డప్పు చప్పుళ్ల మధ్య శివ సత్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబాలు క్షేమంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురియాలని కోరుతూ.. దీవించమ్మ అంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బు మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు జెరుపోతు లక్ష్మణ్ గౌడ్, క్యాషియర్ జక్కు కోటేశ్వర్ గౌడ్,సభ్యులు బాలసాని రవి గౌడ్, దేశిని పరలోకం గౌడ్, కూనురి రవిగౌడ్, పబ్బు ఎల్లా గౌడ్ పచ్చిమట్ల శీనివాష్ గౌడ్, మండ శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments