కాళేశ్వర ఆలయ ఈవో పై వేటు..
గర్బ గుడిలో డ్యాన్సులపై చర్యలు..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి మరి సింగర్ మధు ప్రియ ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై భక్తులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం గా వహించిన ఆలయ ఈవో మారుతి పై వేటు వేసింది. ఆలయ ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
Recent Comments