Friday, April 18, 2025
Homeజిల్లా వార్తలుకాళేశ్వరంలో కలెక్టర్ దంపతుల పూజలు

కాళేశ్వరంలో కలెక్టర్ దంపతుల పూజలు

కాళేశ్వరంలో కలెక్టర్ దంపతుల పూజలు

స్పాట్ వాయిస్, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని ఆదివారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వారికి ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శుభానంద (పార్వతి) అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారి కి శేష వస్త్రాలు అందించి సన్మానించి,తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ధర్మకర్తలు కామిడి రాంరెడ్డి, శ్యామ్ సుందర్, ఆరెల్లి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments