Friday, September 20, 2024
Homeతెలంగాణకేసీఆర్, హరీశ్ బలవంతపెట్టారు..

కేసీఆర్, హరీశ్ బలవంతపెట్టారు..

కేసీఆర్, హరీశ్ బలవంతపెట్టారు..

వారి ఇష్టానుసారమే ఫైనల్ అప్రూవల్.. 

ప్రతి డిజైన్ లో సీడీఓతో పాటు ఎల్ అండ్ టీ సంస్థ పాల్గొంది.. 

కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈఎన్సీ, మాజీ సీఈసీడీవో 

స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి డిజైన్ లో సీడీఓ తో పాటు ఎల్ అండ్ టీ సంస్థ పాల్గొందని, అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని మాజీ సీఈ సీడీవో నరేందర్ రెడ్డి వాపోయారు. కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజైన్స్ డ్రాయింగ్స్ అనుమతి విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ నరేందర్ ను ప్రశ్నించగా ఆయన పై విధంగా బదులిచ్చారు.

తనను ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో ఎక్కడికి పిలువలేదని, ఎక్కడా పాల్గొనలేదన్నారు. అలాగే డీపీఆర్ కి గ్రౌండ్లో నిర్మాణానికి తేడాలు కనిపిస్తున్నాయని అందులో నిజం ఎంతని కమిషన్ నరేందర్ రెడ్డిని ప్రశ్నించగా డిజైన్స్ అప్రూవల్ అంశంలో తమపై ఒత్తిడి ఉన్నదని, అందుకే హడావిడిగా అన్ని డిజైన్స్ పై అప్రూవల్ చేశామన్నారు. నిర్మాణం జరిగేటప్పుడు కన్ స్ట్రక్చన్ తప్పిదాలు జరిగాయి., ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినట్లు తాను అనుకుంటున్నానని నరేందర్ రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్ల డిజైన్స్ అప్రూవల్ సంతకాలు చేశానని చెప్పారు. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్ – డ్రాయింగ్స్ ఏర్పాటు అయ్యాయని తెలిపారు. వర్షా కాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అధికారులు, కాంట్రాక్టు సంస్థ పాటించలేదని, పై అధికారులు, ప్రభుత్వం ఒత్తిడి మేరకే క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేదన్నారు. బ్యారేజీల గేట్ల ఆపరేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ కూడా సరిగ్గా చేయలేదని, టీఎస్ ఈఆర్ఎల్ ఇచ్చిన మార్గదర్శకాలను కాంట్రాక్టు సంస్థ పాటించలేదని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి కమిషన్ కు తెలిపారు. కాగా, పలు ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానం చెప్పనట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల అధ్యయనానికి ఏర్పాటైన కమిషన్ విచారణ వాడివేడీగానే సాగుతున్నది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments