వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం..
మంత్రి హరీష్ రావు
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: వర్ధన్నపేట ఆస్పత్రిని వంద పడకల ఆసుపత్రిగా మారుస్తానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రూ.14 కోట్లతో వర్ధన్నపేట కోనారెడ్డి చెరువుతో పాటు సమీకృత మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. వచ్చే వాన కాలం వరకు వర్ధన్నపేటకు కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. ఏఎన్ఎంల సబ్ సెంటర్లకు రూ. 16 లక్షలు మంజూరు చేయగా.. మరో నాలుగు లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అరూరి కోరగా.. వెంటనే మంత్రి మంజూరు చేశారు. ఐనవోలు పీఎస్సీ అభివృద్ధికి నిధులు రామారం గ్రామం కొత్త పీ ఎస్ సీ సబ్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు పైడిపల్లి పీహెచ్ సీ అభివృద్ధికి నిధులు కోరడంతో అధికారులు ప్రతిపాదనలతో వస్తే నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. వర్ధన్నపేట దవాఖాన సందర్శించి అప్పుడే ప్రసవించిన తల్లికి కేసీఆర్ కిట్టు అందజేశారు. హరీష్ రావు కు కార్యకర్తలు డప్పు చప్పుళ్లు కోలాటంతో స్వాగతం పలికారు. అనంత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కోనారెడ్డి చెరువుకు రూ. 14 కోట్ల నిధులు మంజూరు చేసుకున్నామన్నారు. మున్సిపాలిటీ వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. రూ.83. 47 కోట్ల నిధులతో వర్ధన్నపేట మున్సిపాలిటీ అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి మచ్చుతునక వర్ధన్నపేట మున్సిపాలిటీ అని చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, రైతుబంధు కోఆర్డినేటర్ లలిత యాదవ్, సహకార బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇండ్ల నాగేశ్వర్ , మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్ పర్సన్ ఎలంధర్ రెడ్డి, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, పీఎసీఎస్ చైర్మన్ కన్నా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సుంకరి సాంబయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ గోపాలరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుళ్ళ కుమార స్వామి, పట్టణ అధ్యక్షులు పులి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ల, నాయకులు పాల్గొన్నారు.
మధ్యలోనే జనాలు బయటికి..
మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న సభ మధ్యలో తన ప్రజల వెళుతుండగా పోలీసులు ప్రజలను కూర్చోబెట్టారు. ప్రజలు సభ నుంచి వెళ్లకుండా పోలీసులు బారీ కెడ్ల చుట్టూ పోలీసులు కాపలా కాశారు. ప్రజలు మధ్యలో వెళ్ళిపోతున్నారని డంతో తన ప్రసంగం ముగించారు.
పోలీసుల అత్యుత్సాహం
మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా పాత బస్టాండ్ లో టీ, కిరాణం షాపులను పోలీసులు మూసివేయించారు. ఎండాకాలం ఎండ పూట వ్యాపారం లేక సాయంత్రం పూట వ్యాపారం నడుస్తున్న టైంలో మంత్రి కోసం షాపులు బంద్ చేయించారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Recent Comments