Friday, November 22, 2024
Homeతెలంగాణనువ్వు మగాడివైతే.. 17 ఎంపీ సీట్లు గెలువ్..

నువ్వు మగాడివైతే.. 17 ఎంపీ సీట్లు గెలువ్..

బీఆర్ఎస్ ను బొందపెట్టేటోళ్లు పుట్టలే..
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్
స్పాట్ వాయిస్, హన్మకొండ: ‘‘బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేవారు ఇంకా పుట్టలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకుంటారనుకున్నాం. కానీ మారలేదు. సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తే తమపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్థ కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. బుధవారం హన్మకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రా జకీయాల కోసం కాంగ్రెస్ మేడిగడ్డను వాడుకుంటోందని, మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన కట్టడమైనప్పటికి రేవంత్ సర్కార్ మాత్రం విఫల ప్రాజెక్టుగా చూపించడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష మార్చుకొని తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ గొప్పదనాన్ని కేసీఆర్ దేశం మొత్తం చాటారని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని దానికి రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశామని చెప్పారు. మూడు పిల్లర్లు కుంగడాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని సూచించారు. నిపుణులతో విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గొప్పతానాన్ని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నామని, త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డకు వస్తారని కడియం తెలిపారు. కుంగిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని సూచించారు. రాజకీయాలు చేసి బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల రైతులకు మేలు జరిగిందని, కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వైఫల్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఆగం చేయాలని చూస్తోందని విమర్శించారు. మేనిఫెస్టోలపై చర్చించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆరు గ్యారంటీల పేరుతో 13 హామిలిచ్చారని అవి ఇంకా అమలు చేయలేదని పేర్కొన్నారు. అవన్నీ అమలు చేయకుండా నాలుగు గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments