స్పాట్ వాయిస్, సిద్ధిపేట: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఆయనపై చేయి చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేఏపాల్ పర్యటనకు అనుమతి లేదని.. జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ లీడర్ పాల్ చెంప పగలగొట్టారు. దీంతో గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా.. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కేఏ పాల్‌ను తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు. ఈ ఘటనపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులా.. లేక టీఆర్ఎస్ కార్యకర్తలా… అంటూ మండిపడ్డారు.
Recent Comments