తగ్గిన జేపీఎస్ లు..
సమ్మె విరమణ..
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వెనక్కి తగ్గారు. శనివారం రాత్రి తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చలు జరపగా సమ్మె విరమిస్తున్నట్లు వారు ఆయనకు లేఖ సమర్పించారు. మంత్రి ఎర్రబెల్లి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎలికట్టే శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. ఎవరి బలవంతంతోనూ సమ్మె విరమించడం లేదని తెలిపారు.
Recent Comments