నేను ఆత్మహత్య చేసుకుంటా..
ఎమ్మెల్యే జోగు రామన్న
స్పాట్ వాయిస్, బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా.. అని ఎమ్మెల్యే జోగు రామన్న సవాల్ విసిరారు. పట్టపగలే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. రేవంత్‌రెడ్డి మరోసారి అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల తనను తన ఇంటి పేరుతో విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గతంలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకు నౌకర్‌గా వ్యవహరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధే పరమావధిగా ముందుకు దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని చెప్పారు. తన ఇంటి పేరును వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు ఆదిలాబాద్ పర్యటనలో జోగు రామన్న కాదు జోకుడు రామన్న అంటూ కామెంట్ చేశారు.
Recent Comments