Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఉద్యోగాలే.. ఉద్యోగాలు

ఉద్యోగాలే.. ఉద్యోగాలు

పలుశాఖల్లో భర్తీకి కేబినెట్ ఆమోదం..
ఎందులో ఎన్నంటే..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ యువతకు ఉద్యోగాలపైనే ప్రధాన ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా గురుకులాలు, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ శాఖల్లో నియమాకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మ‌హాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల్లోని ప‌లు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూత‌న ఉద్యోగాల నియామ‌కాల‌కు కేబినెట్ ఆమోదించింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
పోలీస్ శాఖలో..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది.

రోడ్లు భవనాల శాఖలో
రోడ్లు భవనాల శాఖ లో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో.. కొత్తగా 3 చీఫ్ ఇంజినీర్ పోస్టులు, 12 సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 102 డీఈఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments