Thursday, April 3, 2025
Homeజిల్లా వార్తలుజాబ్ మేళాతో యువతకు ఉపాధి

జాబ్ మేళాతో యువతకు ఉపాధి

జాబ్ మేళా తో యువతకు ఉపాధి

ఎస్సై కొంక అశోక్. 

స్పాట్ వాయిస్ దామెర: జాబ్ మేళా తో యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఎస్సై కొంక అశోక్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గల ముస్త్యాలపల్లి గ్రామంలో మంగళవారం ఈనెల 4న పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా పై యువతకు దామెర ఎస్సై కొంక అశోక్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతూనే సమయాన్ని వృధా చేయకుండా, ప్రైవేటు ఉద్యోగంలో నైనా చేరాలన్నారు. ఉద్యోగం ద్వారా తల్లిదండ్రులకు కుటుంబానికి కొంత చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు అనేక కష్టనష్టాలకు ఓర్చి చదివించారని, వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఈనెల 4 నిర్వహించే జాబ్ మేళాలో తమ విద్యార్హతలకు అనుగుణంగా పాల్గొని, వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొంది జీవితాన్ని ఒక అడుగు ముందుకు వేసుకోవాలని సూచించారు. యువత ముందుగా ఏదో ఒక కంపెనీలో చేరి ఉద్యోగం చేసుకుంటూనే, ప్రభుత్వ ఉద్యోగానికి సైతం చదవడం వల్ల, కొంత కాలాన్ని వృధా చేయకుండా ఉంటుందన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాన్ని సాధించాలని ఎస్ఐ కొంక అశోక్ అన్నారు.ఈ సందర్భంగా మహిళ నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో తప్పనిసరిగా తాము పాల్గొని ఉద్యోగాన్ని సాధిస్తామని తమ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments