స్పాట్ వాయిస్, హన్మకొండ: విద్యా, ఉపాధి, ఉద్యోగ, సాధికారత కోసం కదం తొక్కతున్న ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన వరంగల్ నగరంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మెపా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్‌ముదిరాజ్, పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం హన్మకొండలోని మెపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ, ఫౌండర్ మెంబర్ల సమావేశంలో వారు మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మెపా ఎంతో కృషిచేస్తున్నదని అన్నారు. ఇటీవల సిద్ధిపేట జిల్లాలో నిర్వహించిన జాబ్‌మేళా విజయవంతమైందని ప్రకటించారు. ఆ క్రమంలోనే ఈనెల 11వ తేదీన వరంగల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎం దవాఖాన ఎదురుగా ఉన్న ఐఎంఏ హాలులో జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రఖ్యాత కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాకు ఇంటర్, డిగ్రీ, ఆపై అర్హత ఉండి 30 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరై ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. మెపా స్టేట్ ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనర్ నర్సింహుల రాకేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రఖ్యాత సంస్థలు వచ్చే జాబ్‌మేళాకు ముదిరాజ్ యువత అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డు, ఫ్లిప్‌కార్ట్, మెడ్ ప్లస్, ఎస్బీఐ లైఫ్, ప్రీమియర్ హెల్త్ కేర్, G4S శుభగృహ తదితర కంపెనీలు మేళాలో పాల్గొని 500+ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపారు. వివరాల కోసం మెపా ప్లేసెమెంట్ సెల్ కన్వీనర్ రాకేష్ సెల్‌నెం. 9701011801 లో సంప్రదించాలని కోరారు.
Recent Comments