3500లకు పైగా హాజరు..
1000 మందికి జాబ్ ఆఫర్స్..
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు
సూర్యచంద్ర చారిటబుల్ ట్రస్ట్ కు ప్రశంసల వెల్లువ..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుమారు 3500 మందికి పైగా యువతీయువకులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల బాధ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. 3,500మందికి పైగా రిజిస్ట్రేషన్స్ కాగా.. 1000మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రెండు మూడు రోజుల్లో మరింతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగనియామకపత్రాలను సూర్యచంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అక్క,తమ్ముళ్ళు బానోత్ తేజస్విని, సూర్యచంద్ర అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
యువతకు ఉద్యోగాలిప్పించే ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. వేయిమందికి పైగా స్పాట్ లోనే జాబ్ ఆపర్ లెటర్స్ అందజేశామన్నారు. నియామకపత్రాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్లల్లో ఆనందాన్ని చూశామని, అది తాము పడిన శ్రమను మరిచిపోయేలా చేసిందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూతురు, కుమారుడు తేజస్విని, సూర్యచంద్ర తెలిపారు. మా అమ్మ..నాన్న ఎప్పుడూ మహబూబాబాద్ నియోజకవర్గానికి మనం ఎంతో సేవ చేయాలని చెబుతుంటారని, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలసంక్షేమం కోసం నిరంతరం శ్రమించడం మా బాధ్యతగా అని చెప్పారు. మెగా జాబ్ మేళా వంటి అనేక కార్యక్రమాలను ఇక ముందు కూడా సూర్యచంద్ర సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్-డాక్టర్ సీతమహాలక్ష్మి దంపతులు సైతం నియామకపత్రాలు అందజేశారు.
Recent Comments