Friday, September 20, 2024
Homeతెలంగాణనిరుద్యోగులకు గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

ఇక ఉద్యోగాల పండుగ..
జాబ్ క్యాలెండర్ ప్రకటించి డిప్యూటీ సీఎం భట్టి..
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనుమతితో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. మొత్తం పోస్టుల భర్తీకి సంబంధించిన తేదీలను ప్రకటించారు. నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయని భట్టి చెప్పారు. గతంలో రెండుసార్లు గ్రూప్‌-1 పరీక్ష రద్దు అయిందని, అధికారంలోకి రాగానే పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, వివిధ పరీక్షలకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. అలాగే అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్‌-2 వాయిదా వేశామని భట్టి తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ను గురువారం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోదించామని, జాబ్‌ క్యాలెండర్‌ 2024-25ను సభ్యులందరికీ అందించామని చెప్పారు. అక్టోబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, అలాగే ఏఈఈ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. నవంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్‌, అక్టోబర్‌లో మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఉంటాయన్నారు.

వివరాలు ఇవే..

*అక్టోబర్ లో ట్రాన్స్కో, డిస్కంల ఇంజినీరింగ్, ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్
*నవంబర్ లో టెట్ నోటిఫికేషన్
*అక్టోబర్ లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్
2025 ఫిబ్రవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
*2025 జులైలో గ్రూప్-1 మెయిన్స్
*2025 ఫిబ్రవరిలో డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్
*2025 ఏప్రిల్ లో ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఆగస్టులో రాతపరీక్ష
*2025 జూన్లో గురుకుల లెక్చరర్ నోటిఫికేషన్
*2025 మేలో గ్రూప్-2 నోటిఫికేషన్

RELATED ARTICLES

Most Popular

Recent Comments