Friday, September 20, 2024
Homeతెలంగాణజిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత..

జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత..

జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత..

యువ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు..జిట్టా 

స్పాట్ వాయిస్, బ్యూరో :బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు.

 

యువ తెలంగాణ పార్టీ..

సొంతంగా యువ తెలంగాణ పార్టీ నెలకొల్పి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాల్గొన్నారు. తీరా పార్టీని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్‌ 20న బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో 14 ఏండ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఇంతలోనే అనారోగ్యం బారినపడిన ఆయన హఠాన్మరణం చెందారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments