ఇండ్ల మధ్యలో జియో టవర్
అడ్డుకున్న స్థానికులు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కృష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియం ఎదుట సింగరేణి అనుమతితో జియో టవర్ కు ఏర్పాటు చేస్తున్నారు. గమనించిన స్థానికులు టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని టవర్ ఏర్పాటు చేయవద్దని అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ స్పందించి జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీపిఐ పట్టణ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్, జనసేన వరంగల్ పార్లమెంట్ సభ్యులు జేరిపోతుల సనత్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు.
ఇండ్ల మధ్యలో జియో టవర్
RELATED ARTICLES
Recent Comments