జికా వైరస్ టెన్షన్..
తెలంగాణలోనూ కేసులు..
అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కరోనా వైరస్ మళ్లీమళ్లీ వస్తూ.. వణికిస్తున్న వేళా.. ప్రజలను జికా వైరస్ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది. ఐసీఎంఆర్, నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జికా వైరస్ టెన్షన్..
RELATED ARTICLES
Recent Comments