Sunday, January 5, 2025
Homeజిల్లా వార్తలువేడుకలు సంతోషంగా జరుపుకోవాలి

వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి

వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి

 శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలే 

రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి... 

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జనగామ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… నూతన సంవత్సర వేడుకలను శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా జరుపుకోవాలని, వేడుకల పేరుతో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజా జీవనానికి ఆటంకం వాటిల్లకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. డిసెంబర్ 31 రాత్రి 1:00 సమయం దాటి బయటికి వస్తే చర్యలు తప్పవని అన్నారు. భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments