Sunday, November 24, 2024
Homeక్రైమ్పురుగుల మందు తాగిన భార్యాభర్తలు

పురుగుల మందు తాగిన భార్యాభర్తలు

పురుగుల మందు తాగిన భార్యాభర్తలు

-భర్త మృతి,

చికిత్స పొందుతున్న భార్య

-అప్పుల బాధలే కారణం

జనగామ, స్పాట్ వాయిస్: అప్పుల బాధ భరించలేక భార్య భర్తలు పురుగుల మందు తాగడంతో భర్త మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కేతావత్ సంతోష్ వ్యవసాయంతో పాటు హార్వెస్టర్ నడుపుతున్నాడు. హార్వెస్టర్ సరిగా నడకపోవడం, వ్యవసాయం అనుకూలించకపోవడంతో అప్పుల అధికమయ్యాయి. దీంతో కుటుంబంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఉదయం కేతావత్ సంతోష్ భార్య సరోజ ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆసుపత్రికి చేరుకున్న సరోజ భర్త సంతోష్ (40) తీవ్ర మనోవేదన గురై జనగామ ఏరియా ఆసుపత్రి నుండి బయటికి వెళ్లి సోమయ్య కుంట గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి బెంగళూరులో ఉన్న తన సోదరునితో ఫోన్లో మాట్లాడాడు. దాంతో వెంటనే అతను గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో స్థానికులు వ్యవసాయ పొలం వద్ద వెళ్లి సంతోష్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్నారు. స్థానికపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments