Thursday, May 29, 2025
Homeలేటెస్ట్ న్యూస్జనగామలో విషవాయువు కలకలం..!

జనగామలో విషవాయువు కలకలం..!

జనగామలో విషవాయువు కలకలం..

పలువురికి అస్వస్థత..

స్పాట్ వాయిస్, జనగామ: విషవాయువుతో జనగామ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం రాత్రి ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉండే స్థానిక ప్రజలతో పాటు ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషవాయువుతో 20 నుంచి 30 మందికి పైగా దగ్గుతో పాటు వాంతులు బారిన పాడినట్లు సమాచారం. ఈఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మిషన్ భగీరథకు చెందిన క్లోరిన్ లీకేజీ వాసనగా పలువురు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments