మల్లారెడ్డి ఇంటిపై రెండో రోజు ఐటీ దాడులు
400 మంది అధికారులు 65 బృందాలుగా సోదాలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజు బుధవారం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాల భారీ బందోబస్తు మధ్య అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నాటక, ఒడిస్సాలకు చెందిన దాదాపు 400 మంది అధి కారులు 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తు న్నారు పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం నుంచి జరుపుతున్న సోదాల్లో మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇండ్లలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నా రు.
మల్లారెడ్డి కొడుకుకు అస్వస్థత
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో అధికారులు ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు్క్కడే చికిత్స కొనసాగిస్తున్నారు.
Recent Comments