Friday, November 29, 2024
Homeలేటెస్ట్ న్యూస్రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం

రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మూడోరోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి బంధువులు ప్రవీణ్‌రెడ్డి, త్రిశూల్‌రెడ్డి ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు, మల్లారెడ్డి వర్సిటీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 65 బృందాలతో ఐటీశాఖ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు.. తమ ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత పంచనామా నివేదికలను మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు అందజేశారు. ఈనెల 28వ తేదీన (సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో రూ.10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments