Tuesday, September 24, 2024
Homeతెలంగాణపెట్టుబడి సాయం రేపటి నుంచే

పెట్టుబడి సాయం రేపటి నుంచే

ఖాతాల్లో జమ కానున్న రైతబంధు
ఎకరం నుంచి మొదలు..
ఈనెల 5లోపు రిజిస్ర్టేషన్ చేసుకున్నవారంతా అర్హులే
రూ.8వేల కోట్ల కేటాయింపు
స్పాట్ వాయిస్, వరంగల్: రైతుల ఖాతాల్లోకి తొమ్మిదో విడత రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నుంచి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. గత సీజన్‌లో దాదాపు 63 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. ఈ ఏడాది అంతకుమించి రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు సైతం ఈసారి రైతు బంధు అందనుంది. ఈ నెల 5వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన వారికి కూడా ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఏఈవోకు ఈనెల 30తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వానా కాలంలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 28వ తేదీ నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ దఫా కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందనున్నదని తెలిపారు. పంపిణీకి  రూ.7521.80 కోట్లు సిద్ధంగా వున్నాయని తెలిపారు.

విడతల వారీగా
ఈసారి కూడా ముందుగా ఎక రం నుంచి ఎక్కువ భూమి ఉన్న రైతులకు విడ‌త‌ల వారీగా పెట్టుబ‌డి సాయం అందించ‌నున్నారు. ఎక‌రం ఉన్న రైతుల‌కు మొద‌టి రోజు, రెండు ఎక‌రాలు ఉన్న రైతులకు రెండో రోజు ఇలా నిధులు వరుసగా జమకానున్నాయి.
ఏడాదికి రూ.10వేలు
రైతులకు పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థకం కింద ఏడాదికి ఎక‌రానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అంద‌జేస్తుంది. ప్రతీ ఏడాది వానాకాలం పంట వేసే ముందు ఒకసారి, యాసంగి లో పంట వేసే ముందు రెండో సారి పెట్టుబ‌డి సాయం అంద‌జేస్తోంది. 2018 మే 18వ తేదీన ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నది.
గత వానకాలంలో..
గత వానకాలంలో జనగామ జిల్లాలో 1,60,300 మంది రైతులకు 203.7 కోట్లు జమ చేశారు. అలాగే భూపాలపల్లి జిల్లాలో 1,06,391 లక్షల మంది రైతుల ఖాతాల్లో 113.06 జమ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 1,73,178 మంది రైతుల కోసం 198.90 కోట్లు కేటాయించింది. ములుగు జిల్లాలో 72,399 మంది రైతులు ఉండగా.. 77.76 కోట్లు ఖాతాల్లో వేసింది. అలాగే వరంగల్ జిల్లాలో 97,612 మంది రైతుల కోసం 98.18 కోట్లు, హన్మకొండ జిల్లాలో 1,78,565 మంది రైతులకు 168.78 కోట్లు కేటాయించారు. ఇక కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు ప్రతీ జిల్లా నుంచి సుమారు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నిధుల కేటాయింపు పెరగనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments