ఇంటర్ పరీక్షల్లో “నిమిషం” నిబంధన తొలగిoపు
5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలి..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్ : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా విద్యార్థులు పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించలేదు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు కాస్త వెసులుబాటు కలిగిoది
విద్యార్థి మరణం తో..
పరీక్ష రాసేందుకు నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
Recent Comments