స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలను మే 13వ తేదీలోపు వెల్లడిస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా రిజల్ట్స్, క్రోడీకరణ, కోడింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రిజల్ట్స్ వెల్లడికి సంబంధించిన కసరత్తును మే 8వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను బోర్డు ఆదేశించింది. మే 9వ తేదీన ఇంటర్ బోర్డు అధికారులు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నారు. అదే రోజున రిజల్ట్స్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 4, 82, 677 మంది, సెకండియర్ కు సంబంధించి 4 ,65 , 022 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
Recent Comments