Saturday, April 5, 2025
Homeకెరీర్ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్

ఇంటర్ సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్

ఆగస్ట్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఎగ్జామ్స్
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్ట్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యుస్‌ పరీక్ష జూలై 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామ్‌ను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments