Friday, September 20, 2024
Homeకెరీర్మూడు రోజుల్లో ఇంటర్ ఫలితాలు..!

మూడు రోజుల్లో ఇంటర్ ఫలితాలు..!

 స్పాట్ వాయిస్ , ఎడ్యుకేషన్:  ఇంటర్​ ఫస్ట్, సెకండ్ ఇయర్ , పరీక్షల ఫలితాలను ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటర్​బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ఫలితాలను జూన్​ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్​ బోర్డు కార్యదర్శి జలీల్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా సరి చూసుకుంటున్నారు. జూన్​ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments