వెల్లడించిన మంత్రి గంగుల కమలాకర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలతో తడిసిన మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అత్యవసర బాయిల్డ్ కు ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట కొత్తగూడెం జిల్లాకు 14,706 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్‌లో 14,700, కరీంనగర్‌లో 7350, యాదాద్రి, జగిత్యాలల్లో 5000వేల మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ గత సంవత్సరం యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని అన్నారు. గతేడాది ఇదే రోజున 3.23 లక్షా మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా ఈరోజు వరకు 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు.
Recent Comments