బార్డర్ లో కాల్పులు..
కవ్వింపు చర్యలకు దిగిన దాయాది సైన్యం
స్పాట్ వాయిస్, బ్యూరో: ఉగ్ర దాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కవింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. అయితే భారత్ ఆర్మీ దాడిని సమర్థంగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments