Friday, November 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్పెరిగిన విద్యుత్ చార్జీలు... ఏ కేటగిరీలో ఎంతో తెలుసా...?

పెరిగిన విద్యుత్ చార్జీలు… ఏ కేటగిరీలో ఎంతో తెలుసా…?

స్పాట్ వాయిస్, హన్మకొండ: విద్యుత్ చార్జీల బాదుడు శుక్రవారం నుంచే మొదలుకానుంది. గృహ వినియోగదారులకు యూనిట్‌పై 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి చొప్పున వడ్డించనున్నారు. దీంతో వినియోగదారులపై అదనంగా రూ.5,596 కోట్ల భారం పడనుంది. ఐదేళ్ల తర్వాత విద్యుత్ చార్జీలు పెరిగాయి. డిస్కంలు 18శాతం చార్జీల పెంపునకు ప్రతిపాదనలు సమర్పించగా.. 14 శాతం పెంచేందుకు కమిషన్ అనుమతిచ్చింది.
రేట్లు ఇలా..
* నివాస గృహాలకు లో- టెన్షన్‌-1ఏ కేటగిరీలో 50 యూనిట్ల వరకు యూనిట్ చార్జీ రూపాయి 40 పైసల నుంచి రూపాయి 95 పైసలకు పెరగనుంది.
* 50 యూనిట్లు మించి కరెంట్‌ వాడేవారికి 100 యూనిట్ల వరకు యూనిట్‌ 2 రూపాయల 60 పైసలుగా ఉన్న చార్జీ 3 రూపాయల 10 పైసలకు చేరనుంది.
* ఎల్‌టీ-1 బీ1 కేటగిరీలో వంద యూనిట్ల వరకు యూనిట్‌ చార్జీ 3 రూపాయల 30 పైసల నుంచి… 3 రూపాయల 40 పైసలకు మాత్రమే పెరిగింది. 101 నుంచి 200 యూనిట్ల వరకు…. యూనిట్‌ ధర 4 రూపాయల 30 పైసల నుంచి 4 రూపాయల 80 పైసలు చార్జ్ చేయనున్నారు.
* ఎల్‌టీ-1 బీ2లో 200 యూనిట్ల వరకు 5 రూపాయలుగా ఉన్న చార్జీ… 5 రూపాయల 10 పైసలకు చేరింది. 201 నుంచి 300 వరకు 7 రూపాయల 20 పైసల నుంచి 7 రూపాయల 70 పైసలు చేశారు. 301 నుంచి 400యూనిట్ల వరకు యూనిట్ రూ.8.50 పైసలు ఉండగా.. రూ. 9 చేశారు. 401 నుంచి 800యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.9 ఉండగా.. రూ.9.50 చేశారు.
* వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2ఏలో 50 యూనిట్ల వరకు యూనిట్‌కు 6 రూపాయలు ఉండగా.. రూ.7కు చేరింది. వాణిజ్య సముదాయాలకు ఎల్‌టీ-2బీలో 100 యూనిట్ల వరకు రూ.7.50గా ఉన్న యూనిట్‌ చార్జీని రూ.8.50కి పెంచారు. 101 నుంచి 300 యూనిట్ల వరకు… రూ.8.90 పైసలు ఉన్న యూనిట్‌ చార్జీ రూ.9. 90కి పెరిగింది. ఇక 301 నుంచి 500యూనిట్ల వరకు యూనిట్‌ ధర 9 రూపాయల 40 పైసల నుంచి రూ. 10.40 పైసలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments