సింగరేణి ఉద్యోగులకు ఇన్ కం సర్టిఫికెటా..?
ఆగని బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్ల వసూళ్ల దందా..
ఆ మూడు మీ సేవ సెంటర్ల దందాపై చర్యలేవి..
తహసీల్దార్ కార్యాలయంలో సహకరిస్తున్నది ఎవరు..?
ఈ డిస్టిక్ట్ మేనేజర్ ఏం చేస్తున్నట్టు..!
అధికారుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న భూపాలపల్లి ప్రజలు, ప్రజాసంఘాలు
స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎవరి నోట విన్నా.. ఆ మూడు మీ సేవ సెంటర్ల అక్రమ వసూళ్లను చెప్పేస్తున్నారు. ఏదైనా సర్టిఫికెట్ అవసరం ఉందని ఆ సెంటర్లకు వెళ్తే.. వారి నోటికి వచ్చిన అమౌంట్ చెప్పి ముక్కుపిండి వసూల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉన్నా.. అధికారులు చర్యలు తీసుకుంటారనే భయం లేకుండా దందా చేస్తున్నారంటే వాళ్లకు ఏ స్థాయిలో ఆఫీసుల్లో పరపతి ఉందో తెలుసుకోవచ్చు.
సింగరేణి ఉద్యోగులకు ఇన్ కం సర్టిఫికెట్టు..
భూపాలపల్లి అంటేనే సింగరేణి ఉద్యోగులకు నిలయం. ఇక్కడి సింగరేణి ఉద్యోగులకు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రెండు మీ సేవ సెంటర్లతో పాటు పాత కలెక్టరేట్ ఎదుట ఉన్న మరో మీ సేవ సెంటర్ వరప్రదాయినిగా మారింది. అడిగినంత ఇస్తే.. ఇన్ కం సర్టిఫికెట్ ఇంటికి తెచ్చి ఇచ్చే అంత ఘనులు వారు. ‘కొత్త’ ఆలోచనలతో వీరు జేబులు నింపుకుంటూ.. సింగరేణి ఉద్యోగుల్లో కన్నుల్లో ‘సంతోషం’ చూస్తున్నారు. ఉద్యోగులకు ఇన్ కం సర్టిఫికెట్లు జారీ కావడం వెనక తహసీల్దార్ కార్యాలయంలోని పలువురు సిబ్బంది సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క సర్టిఫికెట్లో సహకరించే వారికి కొంత ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా.. ఇక బర్త్, ఫ్యామిలీ సర్టిఫికెట్లపై వసూళ్లను నేటికీ ఆపలేదంటే నిర్వాహకులకు వెనక ఉండి ధైర్యాన్నిస్తున్న వారెవరో అనేది తెలియాల్సి ఉంది.
ఈ డిస్టిక్ట్ మేనేజర్ ఏం చేస్తున్నట్టు..?
మీ సేవ సెంటర్ల పని తీరును పరిశీలించాల్సిన ఈ డిస్టిక్ మేనేజర్ (ఈడీఎం)ను పట్టించుకున్నట్లు ఎక్కడ కనిపిచండం లేదు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మీ సేవ సెంటర్లలో వసూళ్ల దందా సాగుతున్నా.. అవేమీ ఆయన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గణపురం, టేకుమట్ల మండలంతో పాటు ఇతర మండలాల్లోనూ ఇదేవిధంగా సర్టిఫికెట్లపై భారీగా దందా నడుస్తున్న చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అసలు అధికారులు ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Recent Comments