ట్రాక్టర్ నడుపుతున్న తండ్రి..
వరంగల్ జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గోవిందాపురంలో ట్రాక్టర్ రోటావేటర్లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబెల్లి మండలం గోవిందాపురం శివారు లైన్ తండాకు చెందిన గుగులోతు ఏసు, రాజు దంపతుల కుమారుడు బాలు తల్లిదండ్రులతో కలిసి సోమవారం పొలం వద్దకు వెళ్లాడు. బాలు తండ్రి పత్తి విత్తనాలు నాటేందుకు రోటావేటర్తో పొలం చదును చేస్తున్నాడు. తండ్రి రాజుకు మంచినీళ్లు అందించిన బాలుడు ట్రాక్టర్పైన కూర్చున్నాడు. మంచి నీరు తాగిన తండ్రి మళ్లీ ట్రాక్టర్నడుపుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు రోటావేటర్లో పడిపోయాడు. గమనించిన రాజు ట్రాక్టర్ ఆపి చూసే సరికి బాలుడు రోటావేటర్లో పడి నుజ్జు నుజ్జు అయ్యాడు. ఇంకో రెండు రోజులు అయితే పాఠశాలకు వెళ్లే తన కుమారుడు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కన్నీటి పర్యాంతమయ్యాడు.
Recent Comments