Saturday, November 23, 2024
Homeజిల్లా వార్తలురెండో తరగతి బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు

రెండో తరగతి బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు

దేశంలోనే అత్యధిక జరిమానా
స్పాట్ వాయిస్, వరంగల్‌: రెండోతరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమానా విధిస్తూ వరంగల్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం తీర్పు ప్రకటించింది. పోక్సో చట్టం కింద ఈ కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వమే రూ.10 లక్షలను పరిహారంగా అందజేయాలని తీర్పు ప్రకటించి దేశంలో అత్యధిక పరిహారాన్ని ప్రకటించిన న్యాయమూర్తిగా మనీషా శ్రావణ్‌ నిలిచినట్టు పీపీ మోకీల సత్యనారాయణ తెలిపారు. రామన్నపేట పరిసరాల్లో 2019 ఫిబ్రవరి 5న చర్చికి వెళ్లిన ఏడేండ్ల చిన్నారిపై ఓ వ్యక్తి చాక్లెట్‌ కొనిస్తానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువైందని భావించిన న్యాయస్థానం నిందితుడు ప్రభుచరణ్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments